విజేతలుగా కొత్తగూడెం, నల్లగొండ జట్లు.
బాలికల విభాగంలో కొత్తగూడెం.. బాలుర విభాగంలో నల్లగొండ .
విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి, విప్.
సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లలో బాలికల విభాగంలో కొత్తగూడెం , బాలుర విభాగంలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ఖమ్మం 24, కొత్తగూడెం 48 స్కోరు సాధించగా కొత్తగూడెం జట్టు విజయం సాధించిగా, ఖమ్మం జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో వనపర్తి, నల్లగొండ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో వనపర్తి 30 , నల్లగొండ 46 స్కోరు చేసి విజేతగా నిలవగా, వనపర్తి జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. విజేతలకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి, కార్యదర్శి సింగారపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











