నేతన్నలకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చేనేత పరిశ్రమను బలోపేతం చేసి నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఆది శ్రీనివాస్‌ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు…

సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపు.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చేనేత పరిశ్రమను బలోపేతం చేసి నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఆది శ్రీనివాస్‌ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడంతో పాటు వ్యాపారులు, కార్మికులు, నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆది శ్రీనివాస్‌ తెలిపారు. తమ ప్రభుత్వం సుమారు రూ.49 కోట్ల మేర నేతన్నల రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు. నేతన్నలకు చేతినిండా పని కల్పించి చేనేత రంగాన్ని తిరిగి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై దృష్టి.

చేనేత రంగానికి సంబంధించిన విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోకి వచ్చిన 48 గంటల్లోనే నేతన్నలు కోరిన 25 హెచ్‌పీ విద్యుత్‌ కనెక్షన్లలో మార్పులు చేసినట్లు వివరించారు. నేతన్నల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిరిసిల్ల కలెక్టర్‌ చౌరస్తా వద్ద నేతన్నల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ‘జోట నాడే’ స్టాచ్యూ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆది శ్రీనివాస్‌ గుర్తు చేశారు. సిరిసిల్లతో చేనేత రంగానికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ ఏర్పాటు జరిగిందన్నారు.

సీఎం సభకు తరలిరావాలి.

ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చేనేత రంగానికి అందిస్తున్న సహకారాన్ని వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!