కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.
సిరివెలుగు, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఆధ్వర్యంలో 34వ వార్డులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా ఏర్పాటుతో సిరిసిల్ల ప్రాంతం సాధించిన అభివృద్ధిని స్మరించుకుంటూ దశాబ్ద ఉత్సవాలను నిర్వహించారు.











