ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి: గ్రామస్తుడు బిగుళ్ళ బాబు.

సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియతో మాట్లాడారు.గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజు నివాసం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అదనపు నిర్మాణాలు చేపడుతున్నారని బాబు ఆరోపించారు. నిర్మాణాన్ని తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తీసుకోకపోవడంతో…

సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియతో మాట్లాడారు.గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజు నివాసం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అదనపు నిర్మాణాలు చేపడుతున్నారని బాబు ఆరోపించారు. నిర్మాణాన్ని తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించినట్లు తెలిపారు.ఈ వ్యవహారంపై గత సెప్టెంబర్ 25న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు బాబు పేర్కొన్నారు. అయినా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, అక్రమ నిర్మాణం ఉన్నట్లు నిర్ధారణ అయితే దానిని తొలగించి భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని కోరారు. అలాగే సంబంధిత ఉపాధ్యాయుడిపై నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!