ఇండియా కూటమి మహాధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.
సిరివెలుగు,హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలపనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించనున్నారు.











