Category: ప్రాంతీయ వార్తలు
-

ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించి భద్రపరచాలి: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను డిజిటలైజ్ చేయాలి. సిరివెలుగు, కరీంనగర్: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జ్ఞాన్ భారతం మిషన్‌లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో తాళపత్రాలు, లోహాలు, రాతిపై లిఖించిన పురాతన గ్రంథాలు, పద్యాలు, శాసనాలను సేకరించాలని సూచించారు.…
-

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం
సిరివెలుగు, కరీంనగర్ : తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని విమర్శించారు.…
-

మట్టి వినాయకులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి
సిరివెలుగు సిరిసిల్ల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలు నీటిలో త్వరగా కరగకపోవడంతో పర్యావరణానికి…
-

మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
సిరివెలుగు సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులను పూజించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ప్రశాంత…
-

పల్లిమక్తలో ప్రభుత్వ ఆరోగ్య శిబిరం
సిరివెలుగు, కోనరావుపేట: మండలంలోని పల్లిమక్త గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ జిన్న అనూష అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో, సుద్దాల సబ్‌సెంటర్ డాక్టర్ చిరంజీవి పర్యవేక్షణలో శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటు షుగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ‘డ్రైడే ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత,…
-

రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన ఐడీఓసీలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సిరివెలుగు, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…
-

బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొడతాం:పిసిసి అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర
బీజేపీ, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని ఏద్దేవా సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర అన్నారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం…
-

చెత్త వాహనంలో వినాయక విగ్రహాల తరలింపు: జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా
సిరివెలుగు, జగిత్యాల: మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త తరలించే వాహనంలో తరలించడంపై జగిత్యాలలో వివాదం నెలకొంది. జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెట్‌పల్లికి పంపించాల్సిన మట్టి వినాయక విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో తరలించడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. విగ్రహాల తరలింపు కోసం మెట్పల్లి నుంచి జగిత్యాల కలెక్టరేట్‌కు మున్సిపల్ చెత్త వాహనాలను పంపించినట్లు ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం భక్తుల మనోభావాలను…
-

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట ధర్నా
పలు డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు శుక్రవారం సిరిసిల్లలో ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ సీఎంఆర్ అగ్రిమెంట్‌ను ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని కోరారు.…
-

సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్ఎస్సీలో సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపిక
ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం. సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్ఎస్సీ అధికారులు తేజస్విన్ వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్ వర్మ…
Latest News
You May Have Missed












