ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు!

బస్సులు లేక కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల అవస్థలు. పిల్లల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం. అధికారుల పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల రవాణా విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. చిన్నారులు పుస్తకాలతో కూడిన భారీ బ్యాగులతో…

బస్సులు లేక కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల అవస్థలు.

పిల్లల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం.

అధికారుల పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.

అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల రవాణా విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. చిన్నారులు పుస్తకాలతో కూడిన భారీ బ్యాగులతో కిక్కిరిసిన బస్సులో ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో వారి భద్రత, ఆరోగ్యం, సౌకర్యంపై ఆందోళన నెలకొంటోందని తల్లిదండ్రులు తెలిపారు. ఒకే బస్సు నుంచి 109 మంది విద్యార్థులు దిగుతున్న దృశ్యాలను వీడియో తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి రద్దీని నివారించాలని కోరారు. పిల్లల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో, వారి ప్రయాణ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్‌ కూడా తల్లిదండ్రుల డిమాండ్లకు మద్దతు తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!