Category: ప్రాంతీయ వార్తలు
-

హెల్త్ సబ్ సెంటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, టీజీఎంఎస్ఐడీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించిన 9 సబ్ సెంటర్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఒక సబ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో ఆరు…
-

వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మున్సిపల్, పోలీస్, ఎన్పీడీసీఎల్, ఆర్అండ్బి, రవాణా, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, నీటిపారుదల తదితర…
-

ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి:బీఆర్ఎస్ తోట ఆగయ్య
ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకే దాడులు, దౌర్జన్యాలంటూ ఆరోపణలు. సిరివెలుగు, సిరిసిల్ల: శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తోట ఆగయ్య ఆరోపించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని…
-

ఆయిల్‌పామ్‌తో రైతుకు రూ. లక్షల్లో ఆదాయం
ఏడెకరాల్లో 15 టన్నుల దిగుబడి. మరో రెండెకరాల్లో మామిడి, నిమ్మ సాగు. రైతు క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, ముస్తాబాద్: దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగుతో రైతు మంచి ఫలితాలు సాధించారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసి నాలుగేళ్ల అనంతరం 15 టన్నుల దిగుబడితో రూ.3.45 లక్షల ఆదాయం పొందారు. రైతు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్…
-

గణేష్ వేడుకల్లో నిబంధనలు పాటించాలి. ఎస్పీ మహేష్ బి.గితే
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి. డీజేలకు అనుమతి లేదని స్పష్టం. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి గణేష్ మండపాన్ని గణేష్ పోర్టల్–2026లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజా…
-

మహాధర్నా కార్యక్రమానికి భారీగా తరలిరావాలి.జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సయ్యద్ జబీ పిలుపు
ఉద్యోగుల ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి భారీగా తరలిరావాలని జిల్లా ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సయ్యద్ జబీ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఉద్యోగులు స్వచ్ఛందంగా…
-

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు స్వీకరణ సిరివెలుగు, సిరిసిల్ల: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 33 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను చట్టపరంగా త్వరితగతిన…
-

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఐడీఓసీలో 190 దరఖాస్తులు.. మండలాల్లో 126 అర్జీలు సిరివెలుగు సిరిసిల్ల: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.…
-

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరివెలుగు, సిరిసిల్ల: విద్యార్థులు మంచిగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదిగి, ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన మంచాలు, బెడ్స్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు బ్యాంకు ఆధ్వర్యంలో మొత్తం 150 మంచాలు, బెడ్స్ అందించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం…
-

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమ
6 గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమా విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటి అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్…
Latest News
You May Have Missed












