ఎమ్మెల్సీ పదవిపై సిరిసిల్ల బీఆర్‌ఎస్ నేత కన్ను!

కాంగ్రెస్ అగ్రనేతతో రహస్య మంతనాలు? 20 మంది కౌన్సిలర్లతో పార్టీ మారే వ్యూహం. సిరిసిల్ల రాజకీయాల్లో కొత్త సమీకరణాలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో పద్మశాలి బిడ్డనే శాసనమండలికి పంపిస్తానని ప్రకటించడం జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలపై చర్చ మొదలైంది. ఒకవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ పై సిరిసిల్ల పద్మశాలి నేతల లూబియింగ్ రాజకీయాలు నడుస్తున్న క్రమంలో, ఎమ్మెల్సీ…

కాంగ్రెస్ అగ్రనేతతో రహస్య మంతనాలు?

20 మంది కౌన్సిలర్లతో పార్టీ మారే వ్యూహం.

సిరిసిల్ల రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో పద్మశాలి బిడ్డనే శాసనమండలికి పంపిస్తానని ప్రకటించడం జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలపై చర్చ మొదలైంది. ఒకవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ పై సిరిసిల్ల పద్మశాలి నేతల లూబియింగ్ రాజకీయాలు నడుస్తున్న క్రమంలో, ఎమ్మెల్సీ పదవినే లక్ష్యంగా చేసుకుని ఓ బీఆర్‌ఎస్‌ కీలక నేత కొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ అగ్రనేతతో తెరవెనుక చర్చలు సాగుతున్నాయన్న ఊహాగానాలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా ఈ సిరిసిల్ల బిఆర్ఎస్ పద్మశాలి నేతపై జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. అలాగే ఈ పద్మశాలి నేతకు ఎమ్మెల్సీ పదవి కట్టుబెడితే కేటీఆర్ ఆయువుపట్టుపై దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

20 మంది కౌన్సిలర్లతో వ్యూహం?

కేటీఆర్ కు అత్యంత సన్నిహితమైన ఈ పద్మశాలి నేత, సిరిసిల్ల పట్టణ రాజకీయాలపై చక్రం తిప్పే కీలక నేత పార్టీ మారుతున్నాడన్న ప్రచారంపై తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పలువురు కౌన్సిలర్లను వెంట తీసుకుని పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 20 మంది కౌన్సిలర్లతో రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మారుతాడా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నప్పటికీ, పదవుల కోసం పార్టీ మారితే తప్పేంటి అనే వాదనలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో జరుగుతున్న ఓ పద్మశాలి నేత స్థానిక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యూహాలు ఈ పరిణామాలతో ఆసక్తికరంగా మారాయని విమర్శలు వ్యక్తమౌవుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు, మరోవైపు పార్టీల మధ్య మారుతున్న సమీకరణాలు.. వెరసి సిరిసిల్ల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెరవెనుక జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న మంతనాలు కార్యరూపం దాలుస్తాయా.. కౌన్సిలర్ల రాజకీయ నిర్ణయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయా.. ఈ పరిణామాలను చక్రం తిప్పే నేత ఎలా ఎదుర్కొంటారు.. అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!