రైతులకు అండగా సింగిల్ విండో పాలకవర్గాలు పనిచేయాలి

ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలి. ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరివెలుగు, వేములవాడ: నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో సహకార సంఘం చైర్మన్, పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో నూతనంగా నియామకం కాబడిన వేములవాడ మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా వకుళభరణం…

ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలి.

ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

సిరివెలుగు, వేములవాడ: నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో సహకార సంఘం చైర్మన్, పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో నూతనంగా నియామకం కాబడిన వేములవాడ మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా వకుళభరణం శ్రీనివాస్‌తో పాటు నూతనంగా ఎంపికైన పాలకవర్గ సభ్యులకు నిర్వహించిన అభినందన సభలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు..వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. సుమారు 22 గ్రామాలకు సేవలందించే సింగిల్ విండోకు చైర్మన్‌గా, పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన వారిపై గురుతర బాధ్యత ఉందన్నారు. రైతులకు అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.పదవుల కోసం పలువురు ఆశావహులు పోటీపడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఒకరికే అవకాశం కల్పించాల్సి వస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పదవులు దక్కని నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సీనియర్ నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక సమతుల్యతను పాటిస్తూ, రైతులకు సేవ చేయాలనే తపన ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు.సుమారు 13 సింగిల్ విండో సహకార సంఘాలకు సంబంధించి ఇప్పటివరకు 12 చోట్ల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ, పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తించి ఈ నియామకాలు చేపట్టినట్లు వివరించారు. మిగిలిన ప్రాంతంలోనూ ఏకాభిప్రాయంతో త్వరలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రతి నాయకుడి గౌరవాన్ని కాపాడే బాధ్యత తనపై ఉందని, అందరికీ సముచిత అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన నేపథ్యంలో, రైతులు ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేపట్టిందని గుర్తుచేశారు. మారుపాక రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలోనూ వాతావరణ పరిస్థితులు, పంటల ఎంపికపై చర్చించినట్లు తెలిపారు. అయితే జూన్ చివరి నుంచి వర్షాలు కురవడంతో రైతులకు కొంత ఊరట లభించిందని, ఈసారి వరి సాగు చేసిన రైతులకు పంట చేతికందే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.సన్నవడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కల్పించడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో రైతులు సన్నవడ్ల సాగు చేపట్టారని, మార్కెట్‌లో మెరుగైన ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నను వెన్నెముకగా భావించి, వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించినప్పుడు పలువురు విమర్శించినప్పటికీ, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా, వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన సేవలను అందించడంలో సింగిల్ విండో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాలు రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!