సిరిసిల్ల బాలికల కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవం

70 మంది విద్యార్థినులకు ఉచిత హిందీ స్టడీ మెటీరియల్‌ పంపిణీ. సిరివెలుగు, సిరిసిల్ల : ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ భాష హిందీలో గత ఏడాది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. హిందీ అభ్యసిస్తున్న 70 మంది విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జి. వనజాకుమారి, హిందీ అధ్యాపకులు సయ్యద్‌ జబీ మాట్లాడుతూ…

70 మంది విద్యార్థినులకు ఉచిత హిందీ స్టడీ మెటీరియల్‌ పంపిణీ.

సిరివెలుగు, సిరిసిల్ల : ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ భాష హిందీలో గత ఏడాది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. హిందీ అభ్యసిస్తున్న 70 మంది విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జి. వనజాకుమారి, హిందీ అధ్యాపకులు సయ్యద్‌ జబీ మాట్లాడుతూ హిందీ భాష దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉందని తెలిపారు. సాంకేతికంగా కూడా హిందీ అభివృద్ధి చెందుతోందని, ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లోనూ హిందీని అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులు హిందీపై పట్టు సాధించడం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. హిందీ నేర్చుకుంటున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ వనజాకుమారి, హిందీ అధ్యాపకులు సయ్యద్‌ జబీని విద్యార్థినులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మురళి, శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, కె. సునీత, ఎం. సునీత, అఫ్రోజ్‌, కృష్ణవేణి, షాహీదా తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!