ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ అర్ని యూనివర్సిటీ.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు గూడూరి ప్రవీణ్ డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. హిమాచల్ప్రదేశ్లోని అర్ని యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటిస్తూ అధికారికంగా లేఖ ద్వారా తెలిపింది. రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రవీణ్.. అనంతరం ఎంఫిల్ పూర్తి చేసి పరిశోధన చేపట్టారు. ‘భారతదేశంలో సామాజిక మాధ్యమాల ప్రభావం-రాజకీయ చైతన్యం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథాన్ని డాక్టరేట్ అవార్డుకు యూనివర్సిటీ ఎంపిక చేసినట్లు అన్ని యూనివర్సిటీ లేఖలో పేర్కొంది.











