ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్పై ఆవేదన.
సిరివెలుగు, సిరిసిల్ల: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయినా బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఓ దంపతులు పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన ఘటన వీర్నపల్లి మండల పరిషత్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని గోన్యా నాయక్ తండాకు చెందిన బట్టు రోజా, మాన్యా దంపతులు ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లులను హోల్డ్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజావాణికి వచ్చారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీలేఖ దంపతులతో మాట్లాడి, వారం రోజుల్లోగా బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.











