సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కృష్ణా జిల్లా నందిగామ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, పట్టణ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తన పుట్టినిల్లు వేములవాడకు వచ్చి బతుకమ్మ ఆడుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు.











