బతుకమ్మ వేళ యువతి ఆత్మహత్య.
కట్టలింగంపేటలో విషాద ఘటన.
సిరివెలుగు, వేములవాడ: బతుకమ్మ పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కూచి గౌతమి (17) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.











