సమన్వయ సమావేశం. గోడపత్రిక ఆవిష్కరణ.
సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సమక్షంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సమావేశంలో చర్చించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, టౌన్ సీఐ, విద్యుత్ డీఈ, వైద్యాధికారి, సంగీతం శ్రీనివాస్, చేపూరి నాగరాజు, శేఖర్గౌడ్, వికాస్ తరంగిణి సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.











