ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణి వీడాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు…

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్‌ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.

ఎన్నికల కమిషన్‌పై విమర్శలు.

ఎన్నికల కమిషన్‌ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!