కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు భూమిపూజ.
సిరివెలుగు, వేములవాడ: వేములవాడ నాంపల్లి పరిధిలోని జర్నలిస్టుల కాలనీకి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కాలనీని సందర్శించిన ఆయన, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు, మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు, వైర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పచ్చదనం పెంపొందించేందుకు వనమహోత్సవం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, పట్టణ సీఐ వీరప్రసాద్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస్, డీఈలు వెంకటరమణ, అనిల్, ఏఈ అరవింద్, హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు దాసరి దేవేందర్, ఎన్.టి. బాబు యాదవ్, తుమ్మనపల్లి జనార్ధన్, రాపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











