పోషకాహారంతోనే బంగారు భవితకు బాటలు: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

సిరివెలుగు, తంగళ్లపల్లి : పిల్లలకు చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. 9వ పోషణ మాసం సందర్భంగా ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమాన్ని మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషణ మాసం ప్రాధాన్యతను వివరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు,…

సిరివెలుగు, తంగళ్లపల్లి : పిల్లలకు చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. 9వ పోషణ మాసం సందర్భంగా ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమాన్ని మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషణ మాసం ప్రాధాన్యతను వివరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, నువ్వులు, బాలామృతంతో తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతి మంగళవారం ‘10 నిమిషాలు’ కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల సేవలు, వసతులు, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఆరేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు తీసుకెళ్లాలని, ప్రతి నెలా వారి ఎత్తు, బరువును నమోదు చేయించాలని సూచించారు. పిల్లల వయస్సు, బరువు, ఎదుగుదలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని తెలిపారు. ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా అంగన్వాడీల్లో పిల్లలకు విద్యాబోధన జరుగుతుందని వివరించారు. తీవ్రమైన పోషకాహార లోపం, తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలల జీవితంలో మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో ఇంటి వద్ద కూడా పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లలకు అధికంగా చక్కెర పదార్థాలు ఇవ్వకూడదన్నారు.

తల్లులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు, వినికిడి, మాట, మానసిక, శారీరక సమస్యలు, రక్తహీనత లేదా పోషకాహార లోపం గుర్తిస్తే వెంటనే అంగన్వాడీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన పిల్లలను ఆర్‌బీఎస్‌కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌లో ఉన్నత వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, సర్పంచ్‌ మోర లక్ష్మీరాజం, ఇన్‌చార్జి తహసీల్దార్‌ మురళి, ఎంపీడీవో రమేష్‌, వైద్య, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!