ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు పిట్టల భూమేష్‌

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి. సిరివెలుగు, వేములవాడ: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు, న్యాయవాది పిట్టల భూమేష్‌ డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌, మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలోనిర్వహించిన భారీ మహార్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే 50…

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి.

సిరివెలుగు, వేములవాడ: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు, న్యాయవాది పిట్టల భూమేష్‌ డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌, మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలోనిర్వహించిన భారీ మహార్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అలాగే 50 ఏళ్లు దాటిన ముదిరాజ్‌, మత్స్యకార వృత్తిదారులకు ఆసరా పెన్షన్‌ అందించాలని కోరారు. వేములవాడలో ముదిరాజ్‌ భవన్‌ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పిట్టల భూమేష్‌ హెచ్చరించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!