మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: బిఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని మాజీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు…

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని మాజీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుల ఉమా మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. పీఓపీ, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం అనంతరం నీటిలో పూర్తిగా కరగకపోవడంతో పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉందన్నారు. విగ్రహాల పరిమాణంలో పోటీ కాకుండా, పర్యావరణ పరిరక్షణలో పోటీ పడాలని సూచించారు. మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణహితంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, బోల్లి రామ్మోహన్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!