సిరివెలుగు, కరీంనగర్ టౌన్: పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ‘నా దేశం–నా జాతి–నా బాధ్యత’ అంశంపై నిర్వహించిన వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద బోధనలు, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత విలువలతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి జి. తిరుపతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.











