సిరివెలుగు, కోనరావుపేట: మండలంలోని పల్లిమక్త గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ జిన్న అనూష అనిల్కుమార్ ఆధ్వర్యంలో, సుద్దాల సబ్సెంటర్ డాక్టర్ చిరంజీవి పర్యవేక్షణలో శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటు షుగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ‘డ్రైడే ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.











