కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది..


ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 8 రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా 4 వ ఈరోజు అయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు వృద్ధులకు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ వంటావార్పు కార్యక్రమాన్ని తెలంగాణ తల్లి చౌరస్తాలో నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు …
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలా ద్వారా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచి ఒక మేనమామగా భరోసా కల్పించారు ఇంత గొప్ప పథకాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ అదనంగా తులం బంగారాన్ని కూడా ఇస్తానని ప్రజలను నమ్మించి ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసిందని అదేవిధంగా తెలంగాణలో 18 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలకు స్కూటీలను ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని అంతేకాకుండా మహిళలకు ప్రతినెల 2500 రూపాయలను అందిస్తామని చెప్పి మోసగించిందని పూర్తిస్థాయిలో గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోతుందని వృద్ధులకు మహిళలకు వితంతువులకు ఇస్తున్న ఆసరా పింఛన్లను నాలుగు వేలకు పెంచి ఇస్తామని దివ్యాంగుల ఆసరా పింఛన్లను 6000 కు పెంచి ఇస్తామని ఇలా ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో భాగంగా 420 హామీలలో భాగంగా మహిళా సంక్షేమం కోసం మహిళా డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను దివ్యాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి 1000 రోజులైనా పూర్తి చేయకపోవడం సరికాదని ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చాలని ఆడపిల్లలను ప్రతి కుటుంబంలో ఎంతో గౌరవిస్తూ వారిని మనసు నొప్పించకుండా చూసుకునే సంస్కృతి మనది అలాంటిది తెలంగాణ ఆడపడుచులను అమలు కానీ హామీలతో మోసం చేసిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అమలు కానీ హామీలతో మహిళలను దివ్యాంగులను వృద్ధులను మోసగించిన ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు..
అనంతరం మహిళలకు దివ్యాంగులకు వృద్ధుల కు ఇచ్చిన హామీలను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని నినాదాలు చేస్తూ నిరసనగా వంటావార్పు చేసి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు
ఈ కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సెస్ డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!