మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ ట్రెక్కింగ్‌లొకి ఎల్లేతందుకు జనమంతా జబర్దస్తుగా రావాలె: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష​

అక్టోబర్ 18న పొద్దుగాల 6 గంటలకు బేగంపేట ఊరి నుంచే మొదలు!​ అడవి అందాలను కళ్లార చూస్తూ… ఖిల్లా చరిత్రను తెల్సుకునే మంచి అవకాశం!​‘ మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పోస్టరును విడుదల చేసిన కలెక్టర్ సిరి వెలుగు పెద్దపల్లి: జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లా ఎంత గొప్పదో, దాని వెనుక ఉన్న చరిత్ర ఏందో అందరికీ తెల్వాలె. అట్లనే అడవి ప్రకృతి అందాలను చూస్తూ, పర్యావరణాన్ని ఎట్ల కాపాడుకోవాలో చెెప్పుకునేందుకు ‘మన జిల్లా…

అక్టోబర్ 18న పొద్దుగాల 6 గంటలకు బేగంపేట ఊరి నుంచే మొదలు!​

అడవి అందాలను కళ్లార చూస్తూ… ఖిల్లా చరిత్రను తెల్సుకునే మంచి అవకాశం!​‘

మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పోస్టరును విడుదల చేసిన కలెక్టర్

సిరి వెలుగు పెద్దపల్లి: జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లా ఎంత గొప్పదో, దాని వెనుక ఉన్న చరిత్ర ఏందో అందరికీ తెల్వాలె. అట్లనే అడవి ప్రకృతి అందాలను చూస్తూ, పర్యావరణాన్ని ఎట్ల కాపాడుకోవాలో చెెప్పుకునేందుకు ‘మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పేరుతో వాకింగ్, ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఈ ముచ్చటలో జిల్లా జనమంతా పెద్ద యెత్తున వచ్చి పాల్గొనాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు.​మంగళవారం పెద్దపల్లిలో కలెక్టర్ ‘మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పోస్టరును అందరి ముందట ఆవిష్కరించారు.

​కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఏమన్నారంటే!

ఈ నెల అక్టోబర్ 18 ఆదివారం పొద్దున్నే 6 గంటలకు బేగంపేట ఊరి నుంచే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయితది. రామగిరి ఖిల్లాకు పోయి, అక్కడ ఉండే అడవి అందాలను కళ్లార చూసి, మన పాతకాలపు చారిత్రక విశేషాలను తెలుసుకునేకి ఇది చాలా మంచి అవకాశం.

“​ట్రెక్కింగ్‌కు రావాలనుకునేటోళ్లు పేరు రాసుకోవాలె (రిజిస్ట్రేషన్)​”

ఈ ట్రెక్కింగ్‌లో మాకూ నడవాలని ఉందనేటోళ్లు పోస్టరు మీద ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి, మీ పేర్లను నమోదు చేస్కోవాలె. చెట్లు, చేమల నడుమ తిరుగుకుంటా మన ఖిల్లా గొప్పతనం ఏందో తెల్సుకునేందుకు ఈ ప్రోగ్రామ్ మస్తు ఉపయోగపడ్తది.

అడవిని, పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలె​

ట్రెక్కింగ్ పోయేటప్పుడు అడవిలో ఉన్న చెట్లకు, మొక్కలకు గానీ, ఇతర వృక్ష సంపదకు గానీ ఎలాంటి నష్టం చేయొద్దు. అడవిని, ప్రకృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల పట్టింపుతో ఉండి, మన అడవి సంపదను కాపాడేందుకు సహకరించాలె.”​మన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం​”రామగిరి ఖిల్లా లెక్కటి గొప్ప చారిత్రక స్థలాల ప్రాముఖ్యతను నలుగురికీ తెల్పి, వాటిని భద్రంగా చూసుకునే అవగాహన తెచ్చేందుకే ఈ కార్యక్రమం పెడుతున్నాం.

అడవి అందాలను ఆస్వాదిస్తూనే…

మన పూర్వీకులు ఇచ్చిన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరు చేయి చేయి కలపాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ‘ఏజే పెడల్స్ సైకిల్స్’ అఖిల్ రెడ్డి, మాజీ సైనికుడు అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, పెద్దపల్లి యువశక్తి సోషల్ మీడియా ప్రతినిధి అనిల్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!