ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్.
సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మట్టే శ్రీనివాస్, ఆరెల్లి వినయ్, బల్యాల ప్రవీణ్, చెట్టిపెల్లి హరీశ్, కోడం వెంకటేష్, కె. మణిశర్మ, కె.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.











