Category: ప్రాంతీయ వార్తలు
-

రాజన్న ఆలయ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష
పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన…
-

పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లపై తనిఖీలు చేపట్టాలి: సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు. సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు ఫిర్యాదు సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పరిశీలించాలని పిర్యాదులో కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో అనుమతులు, ఫైర్ సేఫ్టీ,…
-

ఎడమ కంటి సర్జరీ కుడి కంటికి.!
సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఘటన. ఆందోళనలో భాధిత కుటుంబం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఎడమ కంటికి సర్జరీ చేయాల్సిన ఓ వృద్దురాలికి కుడి కంటికి సర్జరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఎంకమ్మ అనే వృద్దురాలికి ఎడమ కంటికి సర్జరీ చూపు సమస్య ఉండటంతో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు…
-

పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి దంపతులు
ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్‌పై ఆవేదన. సిరివెలుగు, సిరిసిల్ల: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయినా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఓ దంపతులు పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన ఘటన వీర్నపల్లి మండల పరిషత్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని గోన్యా నాయక్ తండాకు చెందిన బట్టు రోజా, మాన్యా దంపతులు ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లులను హోల్డ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజావాణికి వచ్చారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి…
-

జర్నలిస్టుల కాలనీకి మౌలిక వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు భూమిపూజ. సిరివెలుగు, వేములవాడ: వేములవాడ నాంపల్లి పరిధిలోని జర్నలిస్టుల కాలనీకి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కాలనీని సందర్శించిన ఆయన, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు, మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు, వైర్లు, వీధి దీపాలు ఏర్పాటు…
-

గూడూరి ప్రవీణ్‌కు డాక్టరేట్
ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ అర్ని యూనివర్సిటీ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు గూడూరి ప్రవీణ్ డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని అర్ని యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటిస్తూ అధికారికంగా లేఖ ద్వారా తెలిపింది. రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రవీణ్.. అనంతరం ఎంఫిల్ పూర్తి చేసి పరిశోధన చేపట్టారు. ‘భారతదేశంలో సామాజిక మాధ్యమాల ప్రభావం-రాజకీయ చైతన్యం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన…
-

పండగలకు ముస్తాబవుతున్న భీమన్న ఆలయం
రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానం. ఈవో రమాదేవి ఆదేశాలతో చురుగ్గా ఏర్పాట్లు. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఈఈ రాజేష్. సిరివెలుగు, వేములవాడ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీకలైన సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) పర్వదినాల నేపథ్యంలోరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ఆలయ యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ కాంతులతో శోభాయమానం. ఉత్సవాల సందర్భంగా…
-

ప్రజావాణిలో ఎగ్లాస్ పూర్ వార్డు సభ్యుడి ఫిర్యాదు
గ్రామసభలో సర్పంచ్ దూషించాడని ఆరోపణ. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గ్రామసభలో తనను దూషించి, అవమానపరిచారని ఆరోపిస్తూ ఓ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి సురేష్ అనే వార్డు సభ్యుడు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో కలెక్టర్ గరిమ అగర్వాల్ కు వినతి పత్రం అందజేశాడు. గ్రామంలో ఈ నెల 2న నిర్వహించిన గ్రామసభకు తాను…
-

కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్నలు
పొట్ట దశలో పంట..ఆవేదనలో రైతులు.. విద్యుత్ కోతలపై గంభీరావుపేట రైతుల ధర్నా. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: వరి పంట పొట్ట దశలో విద్యుత్ కోతలు విధించడంపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలంలోని గజసింగవరం, గోరంటాల, సముద్రలింగాపూర్, రాజేశ్వరరావు కాలనీ గ్రామాలకు చెందిన రైతులు సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కరెంటు కోతల కారణంగా పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా…
-

కంప్యూటర్లు డౌన్.. ఆన్‌లైన్‌కు బ్రేక్…
ప్రజావాణిలో నిలిచిన ఆన్లైన్ సేవలు. ఆన్లైన్ చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ. గంటకుపైగా మొరాయించిన కంప్యూటర్లు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజావాణి సందర్భంగా కంప్యూటర్లు గంటకుపైగా మొరాయించడంతో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంప్యూటర్లలో దరఖాస్తులు ఆన్లైన్ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో అధికారులు దాదాపు…
Latest News
You May Have Missed












