వేములవాడలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు!

మహాగౌరీ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దర్శనం. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. సిరివెలుగు, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు మహాగౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలో స్వామివారు, అమ్మవార్లకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం…

మహాగౌరీ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దర్శనం.

భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం.

సిరివెలుగు, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు మహాగౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలో స్వామివారు, అమ్మవార్లకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!