సిరివెలుగు, వేములవాడ: పట్టణంలో శుక్రవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ఇంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణం లోని 28 వ వార్డు కౌన్సిలర్ ప్రతాప హిమబిందు తమ కుటుంబ సభ్యులతో కలసి బతుకమ్మ ను అందంగా అలంకరించి బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.











