పోలీసులపై అసత్య ప్రచారం. ఇద్దరు విలేకరుల అరెస్ట్‌!

కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించారనే అభియోగాలు. కరీంనగర్‌లో అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసు దర్యాప్తునకు సహకరించకుండా, అసత్య ప్రచారం చేస్తూరనే అభియోగాలపై ఇద్దరు పత్రిక నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పత్రిక ఎడిటర్‌, రిపోర్టర్ ఇద్దరినీ మంగళవారం కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేశ్‌ తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు…

కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించారనే అభియోగాలు.

కరీంనగర్‌లో అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసు దర్యాప్తునకు సహకరించకుండా, అసత్య ప్రచారం చేస్తూరనే అభియోగాలపై ఇద్దరు పత్రిక నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పత్రిక ఎడిటర్‌, రిపోర్టర్ ఇద్దరినీ మంగళవారం కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేశ్‌ తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు సమయంలో పోలీసులకు అవసరమైన సమాచారం అందించకుండా, ఎస్సైతో పాటు ఇతర పోలీసు అధికారులపై వ్యక్తిగతంగా కించపరిచేలా, అసత్య కథనాలు రాస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వార్తలు ప్రచురించే ముందు వాస్తవాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలని సీఐ సూచించారు. వ్యక్తిగత కించపరిచేలా అసత్య కథనాలు ప్రచురించినా, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!