రాజన్న ఆలయ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష

పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన…

పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత, వేగం, శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!