పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లపై తనిఖీలు చేపట్టాలి: సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు. సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ కు ఫిర్యాదు సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పరిశీలించాలని పిర్యాదులో కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో అనుమతులు, ఫైర్ సేఫ్టీ,…

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.

సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ కు ఫిర్యాదు సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పరిశీలించాలని పిర్యాదులో కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో అనుమతులు, ఫైర్ సేఫ్టీ, మౌలిక వసతులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్, లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలను తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార భద్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!