గ్రామసభలో సర్పంచ్ దూషించాడని ఆరోపణ.
చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గ్రామసభలో తనను దూషించి, అవమానపరిచారని ఆరోపిస్తూ ఓ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి సురేష్ అనే వార్డు సభ్యుడు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో కలెక్టర్ గరిమ అగర్వాల్ కు వినతి పత్రం అందజేశాడు. గ్రామంలో ఈ నెల 2న నిర్వహించిన గ్రామసభకు తాను వార్డు సభ్యుడి హోదాలో హాజరైనట్లు పిర్యాదులో తెలిపారు. గ్రామసభలో గతంలో పాలకవర్గం తీర్మాణం చేసిన సీసీ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేస్తారని, ఇలా పలు అంశాలపై ప్రశ్నించడంతో గ్రామ సర్పంచ్ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దూషణలకు చేశాడని ఆరోపించాడు. గ్రామసభలో తను వార్డుసభ్యుడని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగాడని పేర్కొన్నారు.ఈ ఘటనతో తాను తీవ్రంగా అవమానానికి గురయ్యానని, గ్రామసభలో ప్రజల సమక్షంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.











