కంప్యూటర్లు డౌన్.. ఆన్‌లైన్‌కు బ్రేక్‌…

ప్రజావాణిలో నిలిచిన ఆన్‌లైన్ సేవలు. ఆన్‌లైన్ చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ. గంటకుపైగా మొరాయించిన కంప్యూటర్లు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజావాణి సందర్భంగా కంప్యూటర్లు గంటకుపైగా మొరాయించడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంప్యూటర్లలో దరఖాస్తులు ఆన్లైన్ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో అధికారులు దాదాపు…

ప్రజావాణిలో నిలిచిన ఆన్‌లైన్ సేవలు.

ఆన్‌లైన్ చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ.

గంటకుపైగా మొరాయించిన కంప్యూటర్లు.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజావాణి సందర్భంగా కంప్యూటర్లు గంటకుపైగా మొరాయించడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంప్యూటర్లలో దరఖాస్తులు ఆన్లైన్ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో అధికారులు దాదాపు గంటకుపైగా ఆన్‌లైన్ ప్రక్రియను నిలిపివేసి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే గంట సమయం తరువాత సాంకేతిక సమస్యను పరిష్కారమై ప్రజావాణి సేవలను యథావిధిగా కొనసాగాయి. కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండానే దరఖాస్తులు ఇచ్చిన దరఖాస్తుదారుల్లో తదుపరి ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!