సిరిసిల్ల జ్యోతి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు రెండు కొత్త కోర్సులు

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ. ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఈసీసీఈ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని జ్యోతి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా దూరవిద్యా విధానంలో రెండు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎం.ఏ. (ఎడ్యుకేషన్‌), డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ECCE) కోర్సులను ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా…

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ. ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఈసీసీఈ.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని జ్యోతి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా దూరవిద్యా విధానంలో రెండు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎం.ఏ. (ఎడ్యుకేషన్‌), డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ECCE) కోర్సులను ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశాల గడువును అక్టోబర్‌ 13, 2026 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.braouonline.in⁠ వెబ్‌సైట్‌లోని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్‌ను సంప్రదించి ప్రవేశాలకు సంబంధించిన తదుపరి వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. కోర్సులు, అర్హతలు, ఫీజులు, ప్రవేశ ప్రక్రియ తదితర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వెంకటేశ్వర్లు సూచించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!