సీఎంకు సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ వినతులు

సానుకూలంగా స్పందించిన సిఎం రేవంత్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తమ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి రెండు ప్రత్యేక వినతిపత్రాలు సమర్పించారు. అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయవాదుల ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక అవసరాల కోసం హెల్త్‌ అండ్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఏర్పాటు చేసేందుకు సుమారు 3 ఎకరాల స్థలం…

సానుకూలంగా స్పందించిన సిఎం రేవంత్.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తమ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి రెండు ప్రత్యేక వినతిపత్రాలు సమర్పించారు. అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయవాదుల ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక అవసరాల కోసం హెల్త్‌ అండ్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఏర్పాటు చేసేందుకు సుమారు 3 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకు ఫ్యామిలీ కోర్టు మంజూరైన నేపథ్యంలో, కోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనం, ఫర్నిచర్‌, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.ఫ్యామిలీ కోర్టును త్వరితగతిన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సిఎం రేవంత్ రెడ్డి న్యాయవాదుల సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!