సిరిసిల్లలో ఆటో కార్మికుల నిరసన

ఎన్నికల హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలంటూ ధర్నా. సిరివెలుగు, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌ సమీపంలోని నేతన్న చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటో కార్మికుల…

ఎన్నికల హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలంటూ ధర్నా.

సిరివెలుగు, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌ సమీపంలోని నేతన్న చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటో కార్మికులు నిరసన తెలిపారు. తమ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లకు వచ్చే ముఖ్యమంత్రి ఆటో కార్మికుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు కోరారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!