మిడ్ మానేరు నుండి నీటి విడుదల తగ్గింపు

పదవ ప్యాకేజీలో మూడు యూనిట్ల పంపింగ్ నిలిపివేత. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్‌వే రేడియల్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఉదయం 10:30 గంటలకు 9,300 క్యూసెక్కులకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, లోడ్ డిస్పాచ్ సూచనలు, టీజీ ట్రాన్స్‌కో షిఫ్ట్ అధికారుల అభ్యర్థన మేరకు పదవ ప్యాకేజీలోని పంపింగ్ యూనిట్లను దశలవారీగా నిలిపివేశారు. యూనిట్–4ను సాయంత్రం 4:45…

పదవ ప్యాకేజీలో మూడు యూనిట్ల పంపింగ్ నిలిపివేత.1

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్‌వే రేడియల్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఉదయం 10:30 గంటలకు 9,300 క్యూసెక్కులకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, లోడ్ డిస్పాచ్ సూచనలు, టీజీ ట్రాన్స్‌కో షిఫ్ట్ అధికారుల అభ్యర్థన మేరకు పదవ ప్యాకేజీలోని పంపింగ్ యూనిట్లను దశలవారీగా నిలిపివేశారు. యూనిట్–4ను సాయంత్రం 4:45 గంటలకు, యూనిట్–3ను 4:56 గంటలకు, యూనిట్–2ను 5:05 గంటలకు మాన్యువల్‌గా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. పంపింగ్ నిలిపివేత ప్రక్రియలో అన్ని భద్రతా, సాంకేతిక ప్రోటోకాల్స్‌ను పాటించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

  1. ↩︎
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!