రెడ్‌క్రాస్ డైరెక్టర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించాలి: సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌

అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు. సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎన్నికల్లో డాక్టర్ గూడూరి రవీందర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించి, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌ శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రవీందర్‌ ప్రస్తుతం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నందున, సిరిసిల్ల రెడ్‌క్రాస్‌ సొసైటీలో సేవలందించేందుకు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల అనుమతి అవసరమా, అనే అంశాన్ని పరిశీలించాలని ఫిర్యాదులో…

అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు.

సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎన్నికల్లో డాక్టర్ గూడూరి రవీందర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించి, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌ శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రవీందర్‌ ప్రస్తుతం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నందున, సిరిసిల్ల రెడ్‌క్రాస్‌ సొసైటీలో సేవలందించేందుకు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల అనుమతి అవసరమా, అనే అంశాన్ని పరిశీలించాలని ఫిర్యాదులో కోరారు. హుజూరాబాద్‌ నుంచి సిరిసిల్లకు తరచూ రాకపోకలు సాగిస్తూ రెడ్‌క్రాస్‌ సేవలకు సమయం కేటాయించడం సాధ్యమవుతుందా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గతంలో సిరిసిల్లలో విధులు నిర్వహించిన సమయంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం విధులకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి, సిరిసిల్లలోని సంబంధిత ప్రైవేట్‌ ఆసుపత్రుల హాజరు రికార్డులతో పాటు నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఇతర అధికారిక ఆధారాలను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించాలని ఎన్నికల అధికారులను కోరారు. రెడ్‌క్రాస్‌ ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి అర్హత, విధులు నిర్వహించే సామర్థ్యం, అవసరమైన అనుమతులు తదితర అంశాలను పరిశీలించి, నామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ వెంట రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యుడు మహమ్మద్‌ వహీద్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!