ట్రాఫిక్‌ నియంత్రణకు మెడికవర్‌ బారికేడ్లు

రూ.1.05 లక్షల విలువైన 15 బారికేడ్లు పోలీసులకు అందజేత. సిరివెలుగు, సిరిసిల్ల: ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారి భద్రతకు సహకరించే ఉద్దేశంతో కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యం సిరిసిల్ల పోలీసులకు 15 ట్రాఫిక్‌ బారికేడ్లను అందజేసింది. మంగళవారం సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెడికవర్‌ ఆసుపత్రి సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ ఆధ్వర్యంలో బారికేడ్లను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లను…

రూ.1.05 లక్షల విలువైన 15 బారికేడ్లు పోలీసులకు అందజేత.

సిరివెలుగు, సిరిసిల్ల: ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారి భద్రతకు సహకరించే ఉద్దేశంతో కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యం సిరిసిల్ల పోలీసులకు 15 ట్రాఫిక్‌ బారికేడ్లను అందజేసింది. మంగళవారం సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెడికవర్‌ ఆసుపత్రి సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ ఆధ్వర్యంలో బారికేడ్లను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లను వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజల రహదారి భద్రతకు ప్రైవేట్‌ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో సహకరించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మెడికవర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కరుణాకర్‌, అబ్దుల్‌ వకీల్‌, మనోజ్, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!