ఆయుర్వేదంతో ఆరోగ్యకర జీవనం: పోషకాహారం, యోగా ప్రాధాన్యతపై అవగాహన

2, 14వ వార్డుల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయుష్‌ శాఖ కార్యక్రమాలు. సిరివెలుగు సిరిసిల్ల : ఆరోగ్యకరమైన జీవన విధానానికి పోషకాహారం, యోగా, ఆయుర్వేదం ఎంతో దోహదపడతాయని ఆయుష్‌ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలోని 2వ, 14వ వార్డుల అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణ్‌ అభియాన్‌లో భాగంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారం, పోషక విలువలు, వాటి ద్వారా…

2, 14వ వార్డుల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయుష్‌ శాఖ కార్యక్రమాలు.

సిరివెలుగు సిరిసిల్ల : ఆరోగ్యకరమైన జీవన విధానానికి పోషకాహారం, యోగా, ఆయుర్వేదం ఎంతో దోహదపడతాయని ఆయుష్‌ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలోని 2వ, 14వ వార్డుల అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణ్‌ అభియాన్‌లో భాగంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారం, పోషక విలువలు, వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయుర్వేదం కేవలం వైద్యం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సూచించే ‘జీవన వేదం’ అని వివరించారు. ఆయుర్వేద పద్ధతులను జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని యోగా శిక్షకులు వివరించారు. యోగాసనాలు, శ్వాసాభ్యాసాల ప్రాధాన్యతను తెలియజేస్తూ పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్‌ వేముల రాములు, 14వ వార్డు కౌన్సిలర్‌ వెంగల లీల, సిరిసిల్ల యునాని డిస్పెన్సరీ వైద్యురాలు డాక్టర్‌ నస్రీన్‌, డీపీఎం తిరుపతి, యోగా శిక్షకులు శ్రీనివాస్‌, స్వప్న, వార్డు అధికారులు మహేష్‌, రమేష్‌, ఆశా వర్కర్లు సుజాత, వర్ష, లావణ్య, లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు ఉమ, వనిత, ఆయాలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!