విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్

సిరివెలుగు, సిరిసిల్ల: లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్ డయాగ్నొస్టిక్ సెంటర్ సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో సుమారు 290 మంది విద్యార్థినులకు సీబీపీ పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజాకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంజలీనా అల్ఫ్రెడ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తహీనత వల్ల…

సిరివెలుగు, సిరిసిల్ల: లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్ డయాగ్నొస్టిక్ సెంటర్ సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో సుమారు 290 మంది విద్యార్థినులకు సీబీపీ పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజాకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంజలీనా అల్ఫ్రెడ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తహీనత వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు క్యాంప్ ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్‌ను అభినందించారు. లయన్స్ మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్, పీడీజీ లయన్ హనుమండ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం బాగుంటేనే చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీధర్, పీడీజీలు అనంతుల శివప్రసాద్, నాగుల సంతోష్, డాక్టర్లు ఎంఎల్‌ఎన్ రెడ్డి, వరుణ్, క్రాంతిరేఖ, అస్మా అంజుమ్‌తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!