ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

అధ్యక్షుడిగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తాడుక సాయికుమార్, కోశాధికారిగా డాక్టర్ ఎ. జైల్‌సింగ్. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన బాధ్యుల ఎంపిక జరగగా, జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్లకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్…

అధ్యక్షుడిగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్.

ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తాడుక సాయికుమార్, కోశాధికారిగా డాక్టర్ ఎ. జైల్‌సింగ్.

సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన బాధ్యుల ఎంపిక జరగగా, జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్లకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ తాడుక సాయికుమార్, కోశాధికారిగా సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎ. జైల్‌సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి. యాదగిరి, డాక్టర్ జి. అభినయ్, సహ కార్యదర్శులుగా డాక్టర్ వెంకట్, డాక్టర్ మోహనకృష్ణ, డాక్టర్ చందన ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షురాలు డాక్టర్ శోభారాణి సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రక్రియకు డాక్టర్ మనోహర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకతతో ఏకగ్రీవంగా ముగిశాయి.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని వైద్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐఎంఏ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య రంగానికి సహకరిస్తూ అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు సీనియర్ వైద్యులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!