మోదీ ప్రజాసేవయే స్ఫూర్తిదాయకం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానమే ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ జిల్లా కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.…

సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానమే ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ జిల్లా కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరేయడానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప్‌ అభియాన్‌ కన్వీనర్‌ సిరికొండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!