బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏచూరి: సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏచూరి అని సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌ సీతారాం అన్నారు. శనివారం ఏచూరి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మృతులాల్‌ శుక్ల కార్మిక భవన్‌లో సీపీఎం నాయకులతో కలిసి ఆయన ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎలిగేటి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఏచూరి చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ…

సిరివెలుగు, సిరిసిల్ల టౌన్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏచూరి అని సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌ సీతారాం అన్నారు. శనివారం ఏచూరి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మృతులాల్‌ శుక్ల కార్మిక భవన్‌లో సీపీఎం నాయకులతో కలిసి ఆయన ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎలిగేటి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఏచూరి చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏచూరి శ్రామికులు, బడుగు బలహీన వర్గాల సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ నాయకులు సిరిమల్లె సత్యం, సూరం పద్మ, ఆడెపు రజిత, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!