ఆయిల్‌పామ్‌తో రైతుకు రూ. లక్షల్లో ఆదాయం

ఏడెకరాల్లో 15 టన్నుల దిగుబడి. మరో రెండెకరాల్లో మామిడి, నిమ్మ సాగు. రైతు క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, ముస్తాబాద్: దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్‌ సాగుతో రైతు మంచి ఫలితాలు సాధించారు. ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసి నాలుగేళ్ల అనంతరం 15 టన్నుల దిగుబడితో రూ.3.45 లక్షల ఆదాయం పొందారు. రైతు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌…

ఏడెకరాల్లో 15 టన్నుల దిగుబడి.

మరో రెండెకరాల్లో మామిడి, నిమ్మ సాగు.

రైతు క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.

సిరివెలుగు, ముస్తాబాద్: దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్‌ సాగుతో రైతు మంచి ఫలితాలు సాధించారు. ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసి నాలుగేళ్ల అనంతరం 15 టన్నుల దిగుబడితో రూ.3.45 లక్షల ఆదాయం పొందారు. రైతు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంగళవారం పరిశీలించారు. మొక్కల పెరుగుదల, దిగుబడి, డ్రిప్‌ ఇరిగేషన్‌, సస్యరక్షణ చర్యలు, పెట్టుబడి, ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మరో రెండెకరాల్లో మామిడి, నిమ్మ తోటలను సాగు చేస్తున్న రైతును కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్‌ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ మొక్కలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటి మూడేళ్లు ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ టన్నుకు రూ.24,025 ధర ఉందని, జిల్లాలో నామాపూర్‌, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్లలో కలెక్షన్‌ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తులను సిద్ధిపేట జిల్లా నర్మెట్టలోని ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే మరిన్ని కలెక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, ఏడీఏ ప్రదీప్‌, తహసీల్దార్‌ ఫారూఖ్‌, ఎంపీడీవో లచ్చాలు తదితరులు ఉన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!