Category: ప్రాంతీయ వార్తలు

  • నాడు వ్యతిరేకించి.. నేడు ఆవిర్భావ వేడుకలా?
    , ,

    నాడు వ్యతిరేకించి.. నేడు ఆవిర్భావ వేడుకలా?

    బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు. జిల్లా ఏర్పాటు ప్రజా ఉద్యమ ఫలితం. కేటీఆర్‌ అప్పటి లేఖను గుర్తుచేసిన విప్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జిల్లా ఏర్పాటు సమయంలో ప్రజల డిమాండ్‌ను వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో…

    Continue Reading

  • సిరిసిల్ల జేఎన్‌టీయూ క్యాంపస్‌కు మోక్షమెప్పుడు?
    , , , ,

    సిరిసిల్ల జేఎన్‌టీయూ క్యాంపస్‌కు మోక్షమెప్పుడు?

    విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి. శాశ్వత భవన నిర్మాణంలో జాప్యంపై ఆవేదన. క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించాలని డిమాండ్‌. సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదేళ్లుగా…

    Continue Reading

  • పూల పరిమళం.. పాటల పరవశం!
    , , , ,

    పూల పరిమళం.. పాటల పరవశం!

    ఆడబిడ్డల ఆటపాటలతో మార్మోగిన సిరిసిల్ల. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు. పల్లెపల్లెనా పండుగ శోభ.. వాడవాడలా సందడి. మానేరు తీరాన మహిళల కోలాహలం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రకృతి ఒడిలో విరబూసిన రంగురంగుల పూలు.. వాటితో పేర్చిన అందమైన బతుకమ్మలు.. గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు.. ఆప్యాయతలు పంచుకునే ఆడబిడ్డలు.. జానపద గీతాల నడుమ లయబద్ధంగా సాగిన ఆటపాటలు.. వెరసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా…

    Continue Reading

  • ఎమ్మెల్సీ పదవిపై సిరిసిల్ల బీఆర్‌ఎస్ నేత కన్ను!
    , , , , ,

    ఎమ్మెల్సీ పదవిపై సిరిసిల్ల బీఆర్‌ఎస్ నేత కన్ను!

    కాంగ్రెస్ అగ్రనేతతో రహస్య మంతనాలు? 20 మంది కౌన్సిలర్లతో పార్టీ మారే వ్యూహం. సిరిసిల్ల రాజకీయాల్లో కొత్త సమీకరణాలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో పద్మశాలి బిడ్డనే శాసనమండలికి పంపిస్తానని ప్రకటించడం జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలపై చర్చ మొదలైంది. ఒకవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ పై సిరిసిల్ల పద్మశాలి నేతల లూబియింగ్ రాజకీయాలు నడుస్తున్న క్రమంలో, ఎమ్మెల్సీ…

    Continue Reading

  • పండగ పూట విషాదం..!
    , , ,

    పండగ పూట విషాదం..!

    బతుకమ్మ వేళ యువతి ఆత్మహత్య. కట్టలింగంపేటలో విషాద ఘటన. సిరివెలుగు, వేములవాడ: బతుకమ్మ పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కూచి గౌతమి (17) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Share this… Facebook Whatsapp Twitter Pinterest Linkedin

    Continue Reading

  • రైతులకు అండగా సింగిల్ విండో పాలకవర్గాలు పనిచేయాలి
    , ,

    రైతులకు అండగా సింగిల్ విండో పాలకవర్గాలు పనిచేయాలి

    ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలి. ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరివెలుగు, వేములవాడ: నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో సహకార సంఘం చైర్మన్, పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో నూతనంగా నియామకం కాబడిన వేములవాడ మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా వకుళభరణం…

    Continue Reading

  • ప్రతిమ మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన
    , ,

    ప్రతిమ మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన

    538 మందికి వైద్య పరీక్షలు.. 56 మందికి శస్త్రచికిత్సల కోసం రిఫర్. డాక్టర్ చెన్నమనేని దీప, వికాస్ చేతుల మీదుగా శిబిరం ప్రారంభం. సిరివెలుగు, వేములవాడ: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్, కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ఆధ్వర్యంలో చందుర్తి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నమనేని దీప, డాక్టర్ చెన్నమనేని వికాస్ శిబిరాన్ని…

    Continue Reading

  • అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట..!
    , , , ,

    అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట..!

    అనుమతుల మాటున అక్రమ మట్టి రవాణా? ఆయా శాఖల పర్యవేక్షణపై ప్రశ్నలు! రాజకీయ అండతో సహజ సంపదకు గండి? చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు! చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట.. ఇదేనా అధికారుల పర్యవేక్షణ.. అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు.. రవాణా జరుగుతున్నాయన్న ఆరోపణలు జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సహజ సంపదను వెలికితీసేందుకు సంబంధిత శాఖలు జారీ చేస్తున్న అనుమతులు ఏ…

    Continue Reading

  • జాతీయ స్థాయి పోటీలకు అఫ్జల్ బేగం ఎంపిక
    , , , , ,

    జాతీయ స్థాయి పోటీలకు అఫ్జల్ బేగం ఎంపిక

    సివిల్ సర్వీసెస్ షటిల్ బ్యాడ్మింటన్‌లో సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమ స్థానం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రతిభ చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొన్న ఆమె రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి…

    Continue Reading

  • పేదలకు మెరుగైన వైద్యం.. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
    , ,

    పేదలకు మెరుగైన వైద్యం.. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

    వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్సలకు సీ-ఆర్మ్ యంత్రం. వినికిడి పరీక్షలు, ప్రత్యేక చికిత్సలకు ఏర్పాట్లు.పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆది శ్రీనివాస్. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, వేములవాడ: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తొమ్మిదో…

    Continue Reading

error: Content is protected !!