అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

బండపల్లిలో దుర్గామాతకు పూజలు. ఆటపాటలతో సందడి చేసిన మహిళలు. సిరివెలుగు, వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కొనరావుపేట మండలాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామగ్రామాన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు.చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో మహిళలు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే…

బండపల్లిలో దుర్గామాతకు పూజలు.

ఆటపాటలతో సందడి చేసిన మహిళలు.

సిరివెలుగు, వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కొనరావుపేట మండలాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామగ్రామాన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు.చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో మహిళలు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్కం మల్లేశం, ఉపసర్పంచ్ ఇసాక్, మాజీ ఎంపీటీసీ ముస్కు పద్మ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!