ఏసీబీ వలలో వేములవాడ తహసిల్దార్

రూ.8 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. భూ భారతి ఆపరేటర్ ద్వారా లంచం స్వీకరణ. సిరివెలుగు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్, ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా ఫిర్యాదుదారుడి…

రూ.8 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

భూ భారతి ఆపరేటర్ ద్వారా లంచం స్వీకరణ.

సిరివెలుగు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్, ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు అధికారికంగా సహకరించాలనే ఉద్దేశంతో ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించారు. భూ భారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి అనిల్ కుమార్ ద్వారా తహసీల్దార్ లంచం స్వీకరించినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ప్రైవేట్ వ్యక్తి అనిల్ కుమార్ వద్ద నుంచి రూ.8 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ అబూబకర్, అనిల్ కుమార్‌లను కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!