వినాయకుడి వద్ద అన్నదానం ప్రారంభించిన కలెక్టర్‌

స్వయంగా వడ్డించిన గరిమ అగ్రవాల్‌. అధికారులతో కలిసి భోజనం. సిరివెలుగు, సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులకు భోజనం వడ్డించారు. అనంతరం అధికారులతో పాటు సిబ్బందితో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ…

స్వయంగా వడ్డించిన గరిమ అగ్రవాల్‌.

అధికారులతో కలిసి భోజనం.

సిరివెలుగు, సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులకు భోజనం వడ్డించారు. అనంతరం అధికారులతో పాటు సిబ్బందితో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సీపీవో శ్రీనివాసాచారి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి శరత్‌బాబు, డీవైఎస్ఓ రాందాస్‌, కలెక్టరేట్‌ ఏవో, పర్యవేక్షకులు రాంరెడ్డి, శ్రీకాంత్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!